అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను శాసనమండలి ఆమోదించింది. లోకాయుక్త సవరణ బిల్లుకు కూడా మండలి ఆమోదం తెలిపింది. జీతాలు, పింఛన్ చెల్లింపు, అనర్హతల తొలగింపు సవరణ బిల్లు, పలు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను లాభదాయక పదవుల నుంచి తొలగింపు, అభయహస్తం పింఛన్ పథకం రద్దు, జీఎస్‌టీ చట్ట సవరణ బిల్లులకు మండలిలో సభ్యులు ఆమోదం తెలిపారు.
అసెంబ్లీ బిల్లులకు మండలిలోనూ ఆమోదం
శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించిన పలు బిల్లులకు మండలి కూడా ఆమోదం తెలిపింది. వీటిలో లోకాయుక్త, అభయహస్తం పింఛన్ పథకం రద్దు, జీఎస్‌టీ చట్ట సవరణ వంటి ముఖ్యమైన బిల్లులు ఉన్నాయి. వీటిపై చర్చ సమయంలో సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు.
చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పలు అంశాలను మండలి దృష్టికి తీసుకువచ్చారు. ఆసరా పెన్షన్‌కు అభయహస్తానికి పోలికే లేదన్నారు. అభయహస్తం పేరిట జమ అయిన రూ. 934 కోట్లు ఏ బ్యాంకులో ఉన్నాయని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. అభయహస్తం మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి సెలెక్ట్ కమిటీకి పంపించాలన్నారు. లోకాయుక్తాలో ఫిర్యాదులు పేరుకు పోతున్నాయని వాటి పరిష్కారానికి కాలపరిమితి పెట్టాలని జీవన్ రెడ్డి సూచించారు. అభయహస్తం అర్హులందరికి ఆసరా పెన్షన్లను అందిస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అభయహస్తం కంటే ఆసరానే లాభదాయకమైన పెన్షన్‌గా ఎర్రబెల్లి పేర్కొన్నారు. లోకాయుక్తాలో వచ్చిన ఫిర్యాదులు వేగంగా పరిష్కరించాలని కోరనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
ఇదీ చూడండి:దేశాన్ని సాకే రాష్ట్రల్లో తెలంగాణ ముందుంటుంది: కేసీఆర్