అసెంబ్లీలో ఆమోదించిన కీలక బిల్లులను శాసనమండలి ఆమోదించింది. లోకాయుక్త సవరణ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. జీతాలు, పింఛను చెల్లింపు, అనర్హతల తొలగింపు సవరణ బిల్లును అంగీకరించింది. కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను లాభదాయక పదవుల నుంచి తొలగింపు బిల్లు, అభయహస్తం పింఛను పథకం రద్దు బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులకు మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి... కాంట్రిబ్యూటరీ పింఛన్ అయిన అభయహస్తంకు ఆసరా పింఛన్‌కు పోలిక లేదని తెలిపారు. అభయహస్తం పేరిట జమ అయిన 934 కోట్లు ఏ బ్యాంక్‌లో ఉన్నాయని ప్రశ్నించారు. అభయహస్తం మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి.. సెలెక్ట్ కమిటీకి పంపించాలని కోరారు. లోకాయుక్తలో ఫిర్యాదులు పేరుకుపోతున్నాయని, వాటి పరిష్కారానికి కాలపరిమితి పెట్టాలన్నారు.