Appointment Orders For JPS In Telangana : జిల్లా స్థాయి కమిటీ పరిశీలన అనంతరం 70 శాతానికి పైగా స్కోరు సాధించిన జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శులను క్రమబద్ధీకరించి నియామక ఉత్తర్వులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) స్పష్టం చేసింది. 9,355 మంది జేపీఎస్(JPS)లను క్రమబద్దీకరించాలని గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రక్రియపై జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రేపటి నుంచి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ మేరకు గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు విధుల్లో చేరనున్నారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శు(Junior Panchayat Secretaries)లకు నిర్ధేశించిన అంశాల్లో జిల్లా స్థాయి మూల్యాంకన కమిటీ చేసిన పరిశీలనలో 70 శాతానికి పైగా స్కోరు వచ్చిన వారికి నియామక ఉత్తర్వులు జారీ చేయాలని తెలిపింది. 70 శాతం కంటే తక్కువ స్కోరు చేసిన వారి పనితీరును మరో ఆర్నెళ్ల పాటు పరిశీలించాలన్న ప్రభుత్వం.. ఆ తర్వాత మరోమారు మూల్యాంకనం చేయాలని పేర్కొంది.
Errabelli responded on JPS issue : 'ఆ సమాచారం వాస్తవం కాదు.. వారిని చర్చలకు పిలవలేదు'
Telangana Junior Panchayat Secretaries Regular News : వారి పనితీరు సంతృప్తికరంగా అనిపిస్తే తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. జేపీఎస్‌ల పనితీరు, వివరాలు అన్నింటినీ మొబైల్ యాప్‌లో నమోదు చేయాలన్న పంచాయతీరాజ్ శాఖ.. క్రమబద్ధీకరణ నియామక ఉత్తర్వులను పొందుపర్చాలని తెలిపింది. 2018 ఆగస్టు 31వ తేదీన డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో నియమాకమై నాలుగేళ్లు పూర్తి చేసుకొని 70 శాతానికి పైగా స్కోరు సాధించిన వారిని మాత్రమే క్రమబద్ధీకరించాలని స్పష్టం చేసింది.