తెలంగాణ

telangana

ETV Bharat / state

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా తమిళిసైకి అపాయింట్​మెంట్​ నోటిఫికేషన్ - telangana latest news

గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​కు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్​ నుంచి మంగళవారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు పుదుచ్చేరి స్పెషల్ రెసిడెంట్ కమిషనర్ కృష్ణకుమార్​సింగ్ వారంట్ ఆఫ్ అపాయింట్​మెంట్ నోటిఫికేషన్​ను తమిళిసైకి అందించారు.

appointment-notification-to-tamilsai-as-lieutenant-governor-of-puducherry
పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా తమిళిసైకి అపాయింట్​మెంట్​ నోటిఫికేషన్

By

Published : Feb 17, 2021, 2:58 PM IST

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్​గా వారంట్ ఆఫ్ అపాయింట్​మెంట్ నోటిఫికేషన్​ను గవర్నర్ తమిళిసై అందుకున్నారు. పుదుచ్చేరి స్పెషల్ రెసిడెంట్ కమిషనర్ కృష్ణకుమార్​సింగ్ హైదరాబాద్ రాజ్​భవన్​లో తమిళిసై సౌందరరాజన్​ను కలిశారు. ఈ మేరకు నోటిఫికేషన్​ను అందించారు.

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న కిరణ్‌ బేడీని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం తొలగించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆమె స్థానంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఇదీ చూడండి: పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్ బేడీ తొలగింపు

ABOUT THE AUTHOR

...view details