తెలంగాణ

telangana

ETV Bharat / state

యాపిల్​ వంకాయలను ఎప్పుడైనా చూశారా? - visakhapatnam latest news update

ఆ కాయను చూసి యాపిల్​ అనుకొని తినేరు... పోనీ టమాటాలా నిగనిగలాడుతుంది కదా అని ప్రతి కూరలోనూ కలిపి వండేంద్దాం అనుకునేరు.. అలా అయితే పప్పులో కాలేసినట్లే. అవునండీ.. చూడటానికి యాపిల్​లా ఎర్రగా ఉంటుంది.. కానీ యాపిల్​ కాదు. పైకి టమాటాలా కనిపిస్తుంది కానీ టమాటా కాదు. ఇంతకీ ఎంటది అనే కదా మీ సందేహం. అదేంటో తెలుసుకోవాలంటే వింతలకు నెలవైన ఏపీలోని విశాఖ మన్యానికి వెళ్లాల్సిందే.

apple-brinjal-crop-at-agency-visakhapatnam-district
యాపిల్​ వంకాయలను ఎప్పుడైనా చూశారా?

By

Published : Jun 27, 2020, 9:04 PM IST

ఎర్రగా ఊరిస్తుంది కదా అని యాపిల్​ అనుకొని తింటే వగరును రుచి చూపిస్తోంది. పోనీ టమాటా అనుకుందామంటే పులుపు లేదాయే. అయినప్పటికీ రుచిలో నేనే మెండు.. కూరగాయాల్లో నేనే కింగు అంటుందీ కొత్త వంగడం. ఆంధ్రప్రదేశ్​ విశాఖ మన్యంలోని హుకుంపేట మండలంలో దర్శనమిచ్చిన ఈ కొత్తరకం కూరగాయ చూడటానికి యాపిల్​ ఆకారంలో... పైన కుచ్చుతో టమాటాను తలపిస్తూ జనాలను ఇట్టే ఆకట్టుకుంటుంది.

కుంతుర్ల అనే గ్రామ రైతులు... గుంటూరు నుంచి తెచ్చిన కొత్తరకం విత్తనాలతో పంట వేశారు. వాటి దిగుబడి చూస్తే ఆశ్చర్యమేసిందా రైతులకు. యాపిల్ వంటి ఆకారం కలిగి ఎర్ర రంగు ఉన్న వంకాయ దర్శనమిచ్చింది. చూసేవారికి చెబితే గానీ అసలు అది వంకాయనే విషయం తెలియదు.

గుంటూరు నుంచి తెచ్చిన యాపిల్ వంకాయ విత్తనాలను సేంద్రియ పద్ధతుల్లో పండించినట్లు రైతు చెప్పాడు. సంతలో యాపిల్​ వంకాయను చూసిన వ్యాపారులు, ప్రజలు ఆసక్తిగా తిలకించారు. దీనిపై అధికారులు మరింత దృష్టి పెడితే మరింత మంది ఈ వంకాయలను సాగు చేస్తారని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు.

యాపిల్​ వంకాయలను ఎప్పుడైనా చూశారా?

ఇదీ చూడండి:ఆ ఒక్క కారణంతో 18 వేల మంది ఖైదీలు విడుదల

ABOUT THE AUTHOR

...view details