హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పొదిలె అప్పారావు ఈనెల 7న బాధ్యతల నుంచి రిలీవ్ కానున్నారు. విశ్వవిద్యాలయంలో అత్యంత సీనియర్ ప్రొఫెసర్ అరుణ్ అగర్వాల్‌కు బాధ్యతలు అప్పగించనున్నారు.
హెచ్‌సీయూ వీసీగా రేపు అప్పారావు రిలీవ్.. అరుణ్ అగర్వాల్‌కు బాధ్యతలు
హెచ్‌సీయూ వీసీగా అప్పారావు ఆదివారం రిలీవ్ కానున్నారు. గతేడాది సెప్టెంబరులోనే పదవీకాలం పూర్తయినప్పటికీ... కరోనా కారణంగా కేంద్రం ఆయననే కొనసాగించింది. విశ్వవిద్యాలయంలోని అత్యంత సీనియర్ ప్రొఫెసర్ అరుణ్ అగర్వాల్‌కు బాధ్యతలు అప్పగించనున్నారు.
హెచ్‌సీయూ వీసీగా అప్పారావు 2015 సెప్టెంబరు 21న నియమితులయ్యారు. గతేడాది సెప్టెంబరులోనే ఐదేళ్ల పదవీకాలం పూర్తయినప్పటికీ... కరోనా సంక్షోభం కారణంగా ఆయనను కేంద్ర ప్రభుత్వం కొనసాగించింది. తనను రిలీవ్ చేయాలని మార్చిలో అప్పారావు చేసిన దరఖాస్తును రాష్ట్రపతి ఇటీవల ఆమోదించారు. అప్పారావు పదవీ కాలంలోనే హెచ్‌సీయూ ప్రతిష్ఠాత్మకమైన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా సాధించింది. అనేక విద్య, పరిశోధనలు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందాయి. అయితే రోహిత్ వేముల ఆత్మహత్య సమయంలో అప్పారావు వివాదస్పదంగా మారారు.
ఇదీ చూడండి:కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టే.. ప్రాణాలు కోల్పోయాడు.!