తెలంగాణ

telangana

corona: అపోలో హాస్పిటల్స్‌ యజమానికి కరోనా

By

Published : Jun 14, 2021, 1:26 PM IST

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డికి కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. తనకు కరోనా సోకడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టీకా తీసుకోవడం వల్ల చాలా తక్కువ లక్షణాలు ఉన్నాయని వెల్లడించారు.

corona, Apollo
వైద్యురాలికి కరోనా, అపోలో

అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగీతా రెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాదాపు 500 రోజుల నుంచి కొవిడ్ నుంచి తప్పించుకున్న తనకు ఈనెల 10న వైరస్ సోకిందన్నారు. తను చాలా జాగ్రత్తగా ఉంటానని, వ్యాక్సిన్ వేయించుకున్నానని పేర్కొన్నారు. అయినా అధిక జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేరానని ఆమె ట్వీట్‌ చేశారు.

రిజెనెరాన్‌ కాక్‌టైల్‌ థెరపీ తీసుకున్నానని, దీనివల్ల చాలా వరకు కోలుకున్నానని వెల్లడించారు. టీకా కరోనాను ఆపలేకపోయినా... లక్షణాలు చాలా తక్కువగా ఉండేలా చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఇది తన విషయంలో గమనించాల్సిన చాలా ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. కరోనాను వెంటనే గుర్తించడం, చికిత్స తీసుకోవడం వల్ల త్వరగా కోలుకోవడం సాధ్యమవుతుందన్నారు. ఆస్పత్రి నుంచి ఇవాళ డిశ్చార్జి అవుతున్నానని, హోం ఐసోలేషన్‌లో ఉంటానని తెలిపారు. ఈ సందర్బంగా చికిత్స సమయంలో తనకు సాయం చేసిన డాక్టర్లు, నర్సులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:కరోనా పాపం చైనాదేనా?

ABOUT THE AUTHOR

...view details