అధిక రక్తపోటుతో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం మెరుగుపడిందని అపోలో ఆస్పత్రి వెల్లడించింది. ఆయన డిశ్చార్జిపై ఈ మధ్యాహ్నం వైద్యులు నిర్ణయం తీసుకుంటారని తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.
నిలకడగా రజనీకాంత్ ఆరోగ్యం.. రిపోర్టులన్నీ నార్మల్ - హైదరాబాద్ తాజా వార్తలు
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందిని ఆపోలో ఆస్పత్రి వెల్లడించింది. వైద్య పరీక్షల్లో అంతా సవ్యంగానే ఉన్నట్లు అపోలో వైద్యులు తెలిపారు. రజనీకాంత్ డిశ్చార్జిపై మధ్యాహ్నం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

నిలకడగా రజనీకాంత్ ఆరోగ్యం.. బులిటెన్ విడుదల చేసిన అపోలో..
ఇప్పటి వరకు రజనీకాంత్‌కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో వచ్చిన నివేదికల్లో ఆందోళన చెందాల్సిన విషయాలేవీ లేవని స్పష్టం చేసిన అపోలో ఆస్పత్రి.... రక్తపోటు హెచ్చుతగ్గుల విషయం సాధారణ స్థితికి వచ్చినట్లు తెలిపింది. వైద్యుల ప్రకటనతో ఊపిరిపీల్చుకున్న కుటుంబసభ్యులు, అభిమానులు... రజనీకాంత్ ఆస్పత్రి నుంచి ఎప్పుడు బయటికొస్తారని ఎదురుచూస్తున్నారు.
ఇదీ చదవండి:సందిగ్ధంలో సర్కారు: ఎల్‌ఆర్‌ఎస్‌పై ఏం చేద్దాం.. ఎలా ముందుకెళదాం?
Last Updated : Dec 27, 2020, 11:54 AM IST