తెలంగాణ

telangana

'రజినీకాంత్ క్షేమం.. పరామర్శకు ఎవరూ రావొద్దు'

By

Published : Dec 25, 2020, 7:54 PM IST

సూపర్​స్టార్​ రజినీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు ఎవరినీ అనుమతించట్లేదని అపోలో వైద్యులు ప్రకటించారు. రజినీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై వాకబు కోసం ఆస్పత్రికి ఎవరూ రావద్దని సూచించారు.

apollo-hospital-doctors-said-no-one-should-come-to-the-hospital-on-rajinikanths-health-condition
'రజినీకాంత్ క్షేమం.. పరామర్శకు ఎవరూ రావొద్దు'

రజినీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. రజినీకాంత్‌ను వైద్యులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన రక్తపోటు నియంత్రణకు వైద్యులు కృషిచేస్తున్నారు.

రేపు రజినీకాంత్‌కు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తారని వైద్యులు పేర్కొన్నారు. రజినీకాంత్‌కు తోడుగా ఆయన కుమార్తె ఉన్నారు. ఆయనను పరామర్శించేందుకు ఎవరినీ అనుమతించట్లేదని అపోలో వైద్యులు ప్రకటించారు. రజినీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై వాకబు కోసం ఆస్పత్రికి ఎవరూ రావద్దని కోరారు. బీపీ హెచ్చు తగ్గుల కారణంగా రజనీకాంత్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

ఇదీ చూడండి :రజినీకాంత్​కు అస్వస్థత..​ జూబ్లీహిల్స్ అపోలోలో చేరిన సూపర్ స్టార్

ABOUT THE AUTHOR

...view details