భారీ వర్షాలతో మేడ్చల్ జిల్లా కొంపల్లి ఉమామహేశ్వర్నగర్ కాలనీవాసులు సర్వం కోల్పోయారు. కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ అభాగ్యుల దీనగాధను చూసి చలించిపోయిన హైవిజన్ రెసిడెన్సీ గ్రేటర్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్లకు ఆపన్న హస్తం అందించింది.
వరద బాధితులకు అండగా అపార్ట్మెంట్ అసోసియేషన్ - hyderabad city news
కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలబడటమే మానవత్వం అంటే. ఇది నిజం చేస్తూ రెసిడెన్సీ గ్రేటర్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అసోసియేషన్ వరద బాధితులకు అండగా నిలిచింది. అపార్ట్మెంట్ కింద తలదాచుకొనివ్వటంతో పాటు ఆహారం అందిస్తూ మానవత్వం చాటుకుంది. ఈ అపార్ట్మెంట్లో ఉంటున్న నటుడు విజయ్ భాస్కర్ బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
వరద బాధితులకు అండగా నిలిచిన అసోసియేషన్
అపార్ట్మెంట్ కింద తలదాచుకొనివ్వటంతో పాటు ఆహారం అందిస్తూ మానవత్వం చాటుకుంది. ఈ అపార్ట్మెంట్లో ఉంటున్న నటుడు విజయ్ భాస్కర్ బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండి:ధరణి పోర్టల్ ప్రారంభానికి అధికారులు సంసిద్ధం కావాలి: సీఎస్