ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్నందున శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 8 నుంచి భక్తులకు ఆలయాలల్లో దర్శనం కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే శ్రీకాళహస్తి రెడ్‌జోన్ పరిధిలో ఉండటంతో శ్రీకాళహస్తీశ్వరాలయంలో మరికొన్ని రోజులు భక్తులకు అనుమతించకూడదని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాల జారీ చేసినట్లు ఈవో పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లలో ఆరు అడుగుల మేర సామాజిక దూరం పాటించేలా వలయాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
'శ్రీకాళహస్తీశ్వరాలయంలో దర్శనాలు నిలిపివేత' - శ్రీకాళహస్తీశ్వరాలయంలో దర్శనాలు నిలివేత: ఆలయ ఈవో
ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో దర్శనాల నిలిపివేత కొనసాగనున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. కరోనా రెడ్‌జోన్‌లో ఆలయం ఉండటం వల్ల దర్శనాలు నిలిపివేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేవరకు దర్శనాలు ఉండవని వెల్లడించారు.
'శ్రీకాళహస్తీశ్వరాలయంలో దర్శనాలు నిలిపివేత'
అంతరాలయం, గర్భాలయ దర్శనం రద్దు చేయడంతో పాటు గంటకు 300మంది భక్తులు మాత్రమే దర్శించుకునేలా చర్యలు చేపట్టామని ఈవో వివరించారు. ప్రతి భక్తుడు విధిగా మాస్కులు ధరించడం సహా ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. అన్నప్రసాదాలు, ఉచిత ప్రసాదాలను పంపిణీ తాత్కాలికంగా నిలుపుదల చేస్తామన్నారు.
ఇది చదవండి: ఏనుగుని చంపినవారి ఆచూకీ చెప్తే రెండు లక్షల నజరానా