ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకునే ఉద్దేశంతో ఉద్యోగులపై నమోదుచేసిన సీఐడీ కేసు కొట్టేయాలని కోరుతూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్ నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు తిరిగి ఇచ్చేలా సీఐడీ, ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
సీఐడీ కేసుపై ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ - సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకునే ఉద్దేశంతో... ఉద్యోగులపై నమోదు చేసిన సీఐడీ కేసు కొట్టేయాలని కోరుతూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
సీఐడీ కేసుపై ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ
ఇదే అంశంపై ఎస్ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి కూడా పిటిషన్ వేసిన నేపథ్యంలో రెండింటిని కలిపి సోమవారం విచారణ చేయనున్నట్లు ఏపీ హైకోర్టు ప్రకటించింది. ఎస్ఈసీ రమేశ్ కుమార్ గతంలో కేంద్రానికి రాసిన లేఖపై అనుమానం వ్యక్తం చేస్తూ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి:శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం