ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. వైకాపా ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. ప్రవీణ్ ప్రకాశ్ ఏపీ ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని, వేరే ఏదైనా శాఖకు బదిలీ చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. తను సిఫార్సు లేఖలు పంపినా.. స్పందించని పలువురు ఉద్యోగులపై సకాలంలో చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని లేఖలో తెలిపారు.
తన ఆదేశాలను పట్టించుకోలేదని..