తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ జారీ చేయలేం: ఏపీ ఎస్ఈసీ

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు తనకు సమయం లేదని ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తెలిపారు. 4 వారాలు ఎన్నికల కోడ్‌ విధించాలన్న బాధ్యతనూ నెరవేర్చలేనని పేర్కొన్నారు. నూతన ఎస్‌ఈసీ భుజస్కంధాలపైనే బాధ్యతలన్నీ ఉంటాయని నిమ్మగడ్డ వివరించారు.

ap-sec-not-conduct-the-elections-for-mptcs-and-zptcs-said-nimmagadda-ramesh-kumar in andhra pradesh
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ జారీ చేయలేం: ఏపీ ఎస్ఈసీ

By

Published : Mar 24, 2021, 1:56 PM IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు తనకు సమయం లేదని ఆంధ్రప్రదేశ్ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు షెడ్యూల్‌ జారీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఉత్తర్వులు జారీ చేశారు. 4 వారాలు ఎన్నికల కోడ్‌ విధించాలన్న బాధ్యతనూ నెరవేర్చలేనని పేర్కొన్నారు. ప్రస్తుతం సిబ్బంది కరోనా టీకా వేయించుకోవడంలో నిమగ్నమయ్యరని ఏపీ ఎస్‌ఈసీ తెలిపారు. ఈ సమయంలో షెడ్యూల్‌ జారీ చేయలేనని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. నూతన ఎస్‌ఈసీ భుజస్కంధాలపైనే బాధ్యతలన్నీ ఉంటాయని నిమ్మగడ్డ తెలిపారు.

మరోవైపు ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిలిచిపోయిన దగ్గర్నుంచే నిర్వహించేలా ఆ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని(ఎస్‌ఈసీ), ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి:తదుపరి సీజేఐగా జస్టిస్ రమణ!

ABOUT THE AUTHOR

...view details