ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. గవర్నర్‌ను కలిశారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలను బిశ్వభూషణ్‌కు వివరించారు. అదే విధంగా అధికారులపై క్రమశిక్షణ చర్యల్ని కూడా ఎస్‌ఈసీ.. గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు పూర్తిగా సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని నిమ్మగడ్డ.. వారిని కోరినట్లు సమాచారం.
ఏపీ గవర్నర్‌తో ఎస్‌ఈసీ భేటీ.. పంచాయతీ ఎన్నికలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్... ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిశారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికలపై 45 నిమిషాల పాటు వారితో చర్చించారు.
ఏపీ గవర్నర్‌తో ఎస్‌ఈసీ భేటీ.. పంచాయతీ ఎన్నికలపై చర్చ
ఇదే సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కూడా రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఎస్‌ఈసీ భేటీ తర్వాత.. ఆయన గవర్నర్‌ను కలిశారు. పంచాయతీ ఎన్నికల నిర్వాహణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఎస్ఈసీకి అందిస్తున్న సహకారాన్ని గవర్నర్‌కు తెలియజేశారు.
ఇదీ చదవండి:విద్యుత్ వాహనదారులకు శుభవార్త... 30 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు