ఇప్పటికే 45 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని.. కొత్తగా మరో 5 లక్షల మంది చేరినట్లు విద్యాశాఖ వెల్లడించింది. ప్రతి విద్యార్థికి పుస్తకాలు అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. దీనికి అనుగుణంగా ఏటా సెప్టెంబరులో 5 శాతం అదనంగా పాఠ్య పుస్తకాలను ముద్రిస్తామని విద్యాశాఖ పేర్కొంది.
త్వరలోనే డీఎస్సీపై నిర్ణయం - ap school education latest news
ఏపీలో రాష్ట్ర స్థాయి విద్యకు ప్రాధాన్యత ఇస్తూనే సీబీఎస్‌ఈ విధానం అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. డీఎస్సీ, టెట్ నిర్వహణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.
ఏపీలో త్వరలోనే డీఎస్సీపై నిర్ణయం
మెగా డీఎస్సీ, టెట్ నిర్వహణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తెలిపింది. గత మూడు నెలలుగా ప్రభుత్వ బడులను తనిఖీ చేస్తున్నట్లు పేర్కొంది. గతేడాది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరుతున్నారని వెల్లడించింది. ప్రైవేటుకు మించి ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని వివరించింది.