కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఛైర్మన్ ఎంపీ సింగ్‌తో ఏపీ నీటి సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు. హైదరాబాద్ జలసౌధలో కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టు ప్రతినిధులు ఆయనతో సమావేశమయ్యారు. తెలంగాణ తీరుతో ఏపీ రైతులు నష్టపోతున్నారని ఫిర్యాదు చేశారు.
krishna board : 'తెలంగాణ తీరుతో ఏపీకి తీరని నష్టం' - ap news
ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదీ ప్రాజెక్టులపై సాగుతున్న జల జగడం రోజురోజుకూ ముదురుతోంది. తెలంగాణ వైఖరిపై ఏపీ నీటిసంఘాల ప్రతినిధులు కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ తీరుతో ఏపీ రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.
krishna board
కృష్ణా జలాల సమస్యపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సమస్యను వివరించేందుకు ఏపీ నీటి సంఘాల ప్రతినిధులు కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌ను కలిశారు.
ఇదీ చూడండి: Krishna: 'తెలంగాణ నీటి వాటా దోచుకునేవాళ్లను దొంగలే అంటారు'