300 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి రైతులు నిరసన తెలుపుతుంటే వారిపై సానుభూతి లేకపోగా.. వైకాపా నేతలు అవమానించేలా మాట్లాడుతున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శించారు. అమరావతి ఉద్యమమే లేకపోతే శాసనసభకు వెళ్లటానికి మీరెందుకు సెక్యూరిటీ పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. అమరావతి ఉద్యమకారుల భయంతోనే సచివాలయానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారని ఎద్దేవా చేశారు.
'అమరావతి ఉద్యమమే లేకపోతే.. అసెంబ్లీ వెళ్లేందుకు సెక్యూరిటీ ఎందుకు?'
అమరావతి ఉద్యమమే లేకపోతే శాసనసభకు వెళ్లటానికి మీరెందుకు సెక్యూరిటీ పెట్టుకుంటున్నారని జగన్ ప్రభుత్వాన్నిఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. సజ్జల వంటి సలహాదారుల వల్ల జగన్ ప్రజలకు దూరం అవుతున్నారని హితవు పలికారు.
'అమరావతి ఉద్యమమే లేకపోతే.. అసెంబ్లీ వెళ్లేందుకు సెక్యూరిటీ ఎందుకు?'
సజ్జల వంటి సలహాదారుల వల్ల జగన్... ప్రజలకు దూరం అవుతున్నారని హితవు పలికారు. కొంతమంది సలహాదారుల వల్ల ఏపీ ముఖ్యమంత్రి ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు దూరమయ్యారని విమర్శించారు. ఇప్పుడు సజ్జల చేసిన వ్యాఖ్యల వల్ల రైతులకు దూరం అయ్యే అవకాశాలున్నాయన్నారు.