తెలంగాణ

telangana

ETV Bharat / state

roja meet megastar: చిరంజీవిని కలిసిన ఏపీ మంత్రి రోజా - మెగాస్టార్​ చిరంజీవి

roja meet megastar :మెగాస్టార్​ చిరంజీవిని ఏపీ మంత్రి రోజా కలిశారు. ఏపీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సురేఖ, చిరంజీవి దంపతులను మర్యాద పూర్వకంగా కలిశారు.

roja meet megastar
చిరంజీవిని కలిసిన ఏపీ మంత్రి రోజా

By

Published : Apr 29, 2022, 9:30 PM IST

Updated : Apr 29, 2022, 10:52 PM IST

roja meet megastar:ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సినీనటుడు చిరంజీవిని కలిశారు. ఈ సాయంత్రం జూబ్లీహిల్స్​లోని చిరంజీవి నివాసానికి కుటుంబసభ్యులతో కలిసి రోజా వెళ్లారు. ఏపీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సురేఖ, చిరంజీవి దంపతులను మర్యాద పూర్వకంగా కలిశారు. రోజాను వారు అభినందించారు. సినీపరిశ్రమ నుంచి వెళ్లి ఏపీ రాజకీయల్లో తనదైన ముద్ర వేసి మంత్రి పదవి చేపట్టిన రోజాను చిరంజీవి దంపతులు అభినందించి... సంతోషం వ్యక్తం చేశారు.

అంతకుముందు రోజా కుటుంబసమేతంగా ప్రగతిభవన్‌కు వచ్చారు. మంత్రి పదవిలో కేసీఆర్​ను మర్యాదపూర్వకంగా కలిసిన రోజా.. సీఎంతో పలు అంశాలపై చర్చించారు. ఏపీ నూతన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజాను.. కేసీఆర్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్​ చిత్రపటాన్ని సీఎంకు రోజా బహుకరించారు.

Last Updated : Apr 29, 2022, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details