తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ ఒప్పందంతో ఆర్టీసీకి పెద్దగా నష్టం ఉండదు: ఏపీ మంత్రి పేర్ని నాని - minister perni nani reaction on rtc agrement news

తెలంగాణ ఆర్టీసీతో చేసుకున్న ఒప్పందంతో ఏపీ ఆర్టీసీకి పెద్దగా నష్టం ఉండదని ఆ రాష్ట్ర మంత్రి పేర్నినాని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏపీఎస్ఆర్టీసీని బతికించడమే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల్లో బస్సులను పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

ap minister perni nani about rtc agreement in Telugu states
ఏపీ: ఆ ఒప్పందంతో ఆర్టీసీకి పెద్దగా నష్టం ఉండదు: మంత్రి పేర్ని నాని

By

Published : Nov 4, 2020, 9:36 PM IST

ఏపీఎస్ఆర్టీసీని బతికించాలన్నదే ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్ ముఖ్య ఉద్దేశమని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. తెలంగాణ ఆర్టీసీతో కుదిరిన ఒప్పందం వల్ల ఆర్టీసీపై పెద్దగా ప్రభావం చూపబోదని వ్యాఖ్యానించారు. ప్రజలకు కాస్త ఇబ్బందులు తలెత్తినా... ఆర్టీసీకి వచ్చే రాబడిలో పెద్ద తేడా ఉండదని చెప్పారు. ఎక్కువ మంది ప్రయాణికులు సొంత వాహనాల్లో వెళ్లేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.

తెలంగాణలో బస్సులు తిరగకపోవడం కంటే కొవిడ్ వల్ల జరిగిన నష్టమే ఎక్కువని వివరించారు. ఆర్టీసీ... ప్రజా-ప్రభుత్వం చేతిలో ఉండేలా చర్యలు చేపడుతున్నామని పేర్ని పేర్కొన్నారు. సంస్థను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పడకుండా చూస్తున్నామన్నారు. డిమాండ్​ను బట్టి అన్ని రూట్లలో బస్సులను పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:ఎట్టకేలకు సరిహద్దు దాటిన బస్సుచక్రం

ABOUT THE AUTHOR

...view details