botsa on puvvada comments: పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు ముప్పు, విలీన మండలాలను తెలంగాణలో కలపాలంటూ ఆ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తెలంగాణ విడిపోవడం వల్ల హైదరాబాద్ ద్వారా ఏపీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోయిందని.. గతంలా ఉమ్మడి రాష్ట్రంగానే ఉంచాలని తాము అడిగితే బావుంటుందా? అని ప్రశ్నించారు. పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు బొత్స వద్ద ప్రస్తావించగా ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.
ఉమ్మడి రాష్ట్రంగానే ఉంచమనండి.. మాకు అభ్యంతరం లేదు: ''పోలవరం ఎత్తు ఎప్పుడు పెంచారు? డిజైన్ల ప్రకారమే నిర్మాణం జరుగుతోంది. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏమీ చేయలేదు కదా? తెలంగాణ విడిపోవడం వల్ల హైదరాబాద్ ద్వారా ఏపీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. హైదరాబాద్‌ను ఏపీలో కలిపేయమని అడగగలమా?గతంలా ఉమ్మడి రాష్ట్రంగా ఉంచాలని అడిగితే బావుంటుందా? అలా అయితే చేసేయమనండి. ఉమ్మడి రాష్ట్రంగానే ఉంచమని చెప్పండి.. మాకు అభ్యంతరం లేదు. సాంకేతికంగా ఇబ్బందులొస్తే దాన్ని ఎలా అధిగమించాలనేది ఆలోచించాలి.