ఏపీలో ఖాళీ అయిన శాసన సభ్యుల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక కోసం జూన్ 18న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 25 వరకు గడువు ఇచ్చింది. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. జులై 6న ఓటింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం లెక్కింపు చేయనున్నారు.
డొక్కా ఎందుకు రాజీనామా చేశారంటే..
రాజధాని బిల్లుల సమయంలో ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేశారు. తెదేపా ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేస్తూ.. లేఖను ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. భవిష్యత్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు. అనంతరం ఆయన వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీ నుంచి పోటీ లేకుంటే ఆయన ఎన్నిక ఏకగ్రీవమే అవుతుంది.
ఇదీ చూడండి:రాష్ట్రంలో పదివేలు దాటిన కరోనా కేసుల సంఖ్య