తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ లాసెట్​ ఫలితాలు విడుదల.. 91.39 శాతం ఉత్తీర్ణత - ఏపీ లాసెట్​ ఫలితాలు వార్తలు

ఏపీ లాసెట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. వీటిని అనంతపురం ఎస్కే యూనివర్సిటీ డైరక్టర్ అండ్ రిజిస్టర్ కృష్ణనాయక్ విడుదల చేశారు. లాసెట్ కు సంబంధించిన మూడు విభాగాల్లో 91.39 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.

ap-lawcet-results-release-at-ananathapuram
ఏపీ లాసెట్​ ఫలితాలు విడుదల.. 91.39 శాతం ఉత్తీర్ణత

By

Published : Nov 5, 2020, 10:59 PM IST

ఏపీ లాసెట్ ఫలితాలను అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీలో డైరక్టర్ అండ్ రిజస్టర్ కృష్ణనాయక్ విడుదల చేశారు. లాసెట్ కోసం 18,371 మంది దరఖాస్తు చేసుకోగా 66.72 మంది పరీక్షకు హాజరైనట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహించమన్నారు. లాసెట్ కు సంబంధించి మూడు విభాగాల్లో 91.39 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు.

2019 తో పోలిస్తే ఈసారి రికార్డు స్థాయిలో అభ్యర్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారని.. కృష్ణనాయక్​ తెలిపారు. ఈ నేపథ్యంలో న్యాయవిద్య అభ్యసించేందుకు చాలా మంది ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: నవంబర్ 7న బీఎస్సీ- హానర్స్​ రెండో విడత కౌన్సిలింగ్​

ABOUT THE AUTHOR

...view details