అక్రమ నిర్బంధం విషయంలో పిటిషన్ ఉపసంహరించుకోవాలని న్యాయవాదులను పోలీసులు బెదిరిస్తున్నారని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించిందంటూ.. మీడియా ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి సుచరిత దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ఆ విధంగా చేస్తున్నారా? అని ప్రశ్నించారు.
'లాయర్లను పోలీసులు బెదిరిస్తున్నారనడం సమంజసమా?' - ఏపీ తాజా వార్తలు
న్యాయవాదులను పోలీసులు బెదిరిస్తున్నారనడం ఎంతవరకు సమంజసం అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఏపీలోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ విషయంపై మాట్లాడారు.

'లాయర్లను పోలీసులు బెదిరిస్తున్నారనడం సమంజసమా?'
స్పందించిన హోం మంత్రి.. న్యాయవాదులను పోలీసులు బెదిరిస్తే ఊరుకుంటారా? అని తిరిగి ప్రశ్నించారు. న్యాయవాదులను పోలీసులు బెదిరిస్తున్నారనడం ఎంతవరకు సమంజసం అన్నారు.
ఇవీ చూడండి:'తెలంగాణ మహిళా పోలీసులు దేశానికే ఆదర్శం'