తెలంగాణ

telangana

ETV Bharat / state

తితిదే పూజా సంప్రదాయాలపై దాఖలైన పిల్‌ కొట్టివేత - తితిదే పూజా సంప్రదాయాలపై దాఖలైన పిల్‌ కొట్టివేత న్యూస్

తిరుమల తిరుపతి దేవస్థానం.. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాల నిర్వహణలో సంప్రదాయాలు, నిబంధనలను పాటించడం లేదంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ఏపీ హైకోర్టు కొట్టేసింది. కొన్ని దేవాలయాల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రత్యేకంగా ఉంటాయని, వాటిపై కోర్టులు విచారణ జరపలేవని స్పష్టం చేసింది.

తిరుమల
తిరుమల

By

Published : Jan 6, 2021, 12:41 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయంలో పూజా కార్యక్రమాల నిర్వహణ సందర్భంగా సంప్రదాయాలు , నిబంధనలను పాటించడం లేదని పేర్కొంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ఏపీ హైకోర్టు కొట్టేసింది. కొన్ని దేవాలయాల సంప్రదాయాలు, ఆచారాలు ప్రత్యేకంగా ఉంటాయని.. ఆ విషయాల్లో కోర్టులు విచారణ జరపలేవని స్పష్టంచేసింది.

పిటిషనర్ హక్కులు ప్రభావితం అయితే వ్యాజ్యం దాఖలు చేసుకోవాలి తప్ప.. పిల్ దాఖలు చేయడం సరికాదని తేల్చి చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details