తెలంగాణ

telangana

By

Published : Jan 6, 2022, 8:43 AM IST

ETV Bharat / state

chandrababu cid case : సీఐడీ కేసులో స్టే పొడిగింపు

chandrababu cid case : తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఏపీ మాజీ మంత్రి పి.నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఆ రాష్ట్ర హైకోర్టు మరో ఆరు వారాలు పొడిగించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ ధర్మాసనం ఆదేశాలిచ్చింది.

CBN-HC
CBN-HC

chandrababu cid case : ఏపీ రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసులో గతేడాది మార్చి 19న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు మరో ఆరు వారాలు పొడిగించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌. మానవేంద్రనాథ్‌రాయ్‌ బుధవారం ఆదేశాలిచ్చారు.

రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు చంద్రబాబు, నారాయణపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో పాటు ఏపీ అసైన్డ్‌ భూముల నిరోధక చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీఐడీ తమపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ వారిరువురూ హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు... సీఐడీ నమోదు చేసిన కేసులపై స్టే విధించింది. ఈ వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు వచ్చాయి.

ఇదీ చదవండి :వైకాపా వైరస్.. తెలుగుదేశమే వ్యాక్సిన్ : చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details