తెలంగాణ

telangana

ETV Bharat / state

AP High Court: హైకోర్టులో రాజధాని కేసుల రోజువారీ విచారణ ప్రారంభం - ఏపీ హైకోర్టులో రాజధాని కేసుల విచారణ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్​ హైకోర్టులో (ap high court) రాజధాని కేసుల రోజువారీ విచారణ ప్రారంభమైంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ మొదలుపెట్టింది.

AP High Court
హైకోర్టులో రాజధాని కేసుల రోజువారీ విచారణ ప్రారంభం

By

Published : Nov 15, 2021, 12:44 PM IST

ఏపీ హైకోర్టులో (ap high court) రాజధాని కేసుల రోజువారీ విచారణ ప్రారంభమైంది. ఉన్నత న్యాయస్థానం సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణను మొదలుపెట్టింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతోంది. అయితే.. త్రిసభ్య ధర్మాసనం నుంచి ఇద్దరు జడ్జిలను తప్పించాలని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు.

కాగా ప్రభుత్వ న్యాయవాది వాదనలను త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. పిటిషన్లు దాఖలు చేసిన రైతుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌దివాస్‌ వాదనలు వినిపిస్తున్నారు. రాజధాని కేసుల విచారణకు ప్రాముఖ్యం ఉందని ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ రాష్ట్రంలో అభివృద్ధి అంతా నిలిచిపోయినట్లు అనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కక్షిదారులతోపాటు అందరూ ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.

ఇదీ చూడండి:Weather Report: అండమాన్‌లో మరో అల్పపీడనం... ఇవాళ, రేపు భారీ వర్షాలు

ABOUT THE AUTHOR

...view details