తితిదే ఈవో ధర్మారెడ్డికి జైలుశిక్ష, జరిమానా - TTD Eo Dharma Reddy Latest News
![తితిదే ఈవో ధర్మారెడ్డికి జైలుశిక్ష, జరిమానా TTD EO Dharma Reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17196025-814-17196025-1670937026195.jpg)
18:20 December 13
ధర్మారెడ్డికి కోర్టు ధిక్కరణ కేసులో నెలరోజులు జైలు శిక్ష, రూ.2వేలు జరిమానా
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. ముగ్గురు తాత్కాలిక ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ వ్యవహారంలో కోర్టు ఆదేశాలు అమలు చేయలేదని ఉద్యోగులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఉద్యోగుల విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ధర్మారెడ్డికి నెల రోజుల జైలు శిక్ష, రూ. 2వేలు జరిమానా విధిస్తూ ఉన్నత న్యాయస్థానం మంగళవారం తీర్పు వెల్లడించింది.
ఇవీ చదవండి:బీఎల్ సంతోష్, జగ్గు స్వామికి ఇచ్చిన 41ఏ నోటీసుపై స్టే కొనసాగింపు
గవర్నర్కు సర్కారు షాక్.. యూనివర్సిటీల వీసీగా తొలగింపు!.. అసెంబ్లీలో బిల్లు పాస్