కోర్టు ధిక్కరణ కేసు.. అధికారులకు జైలు శిక్ష రద్దు.. సాయంత్రం వరకు కోర్టులోనే - ఏపీ హైకోర్టు న్యూస్
12:14 January 18
ఇద్దరు విద్యాశాఖ అధికారులకు జైలుశిక్ష విధించిన ఏపీ హైకోర్టు
AP High Court sentenced two officials to jail: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు విద్యాశాఖ అధికారులకు ఆ రాష్ట్ర హైకోర్టు విధించిన జైలు శిక్షను ఉన్నత న్యాయస్థానం సవరించింది. కోర్టు ధిక్కరణ కేసులో భాగంగా ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, ఇంటర్ బోర్డు కమిషనర్ రామకృష్ణకు నెల రోజుల పాటు జైలు శిక్ష, రెండు వేలు జరిమానా విధిస్తూ హైకోర్టు మొదట తీర్పు ఇచ్చింది. అయితే ఆ ఇద్దరు అధికారులు హైకోర్టుకు వచ్చి క్షమాపణ చెప్పడంతో జైలు శిక్షను రద్దు చేసింది. బదులుగా సాయంత్రం వరకు కోర్టులోనే నిలబడాలని ఆదేశాలు జారీ చేసింది. సర్వీసు అంశాలకు సంబంధించిన కేసులో గతంలో ఇచ్చిన హైకోర్టు తీర్పును అమలు చేయని నేపథ్యంలో శిక్ష విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: