తెలంగాణ

telangana

ETV Bharat / state

AP HIGH COURT: 'భర్తతో సన్నిహితంగా ఉంటున్న వేరే మహిళను విచారించడానికి వీల్లేదు' - section 498 A latest news

ఐపీసీ సెక్షన్ 498ఏ కింద నమోదు చేసిన కేసులో భర్తతో సన్నిహితంగా ఉంటున్న వేరే మహిళను విచారించడానికి వీల్లేదని ఏపీ హైకోర్టు పేర్కొంది. తన భర్తతో ఓ మహిళ అక్రమ సాన్నిహిత్యం కలిగి ఉన్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు నెల్లూరు జిల్లాలో పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ హైకోర్టులో పిటిషన్ వేశారు.

AP HIGH COURT
ఐపీసీ సెక్షన్ 498ఏ

By

Published : Jul 26, 2021, 7:49 AM IST

భారత శిక్షా స్మృతి (Indian Penal Code) సెక్షన్ 498ఏ కింద నమోదు చేసిన కేసులో భర్తతో సన్నిహితంగా ఉంటున్న వేరే మహిళను విచారించడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు పేర్కొంది. సెక్షన్ 498ఏ (మహిళల పట్ల క్రూరంగా వ్యవహరించటం) ప్రకారం.. భర్త రక్తసంబంధీకులు, అతని బంధువులను మాత్రమే విచారించడానికి వీలుందని స్పష్టం చేసింది.

ఓ వ్యక్తితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారంటూ 'ఓ మహిళ'పై పోలీసులు 498ఏ కింద నమోదు చేసిన కేసులో ఆమె అరెస్ట్​తో పాటు తదుపరి చర్యలను నిలువరిస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

అసలు ఏం జరిగింది?

నెల్లురుకు చెందిన ఓ మహిళ దిశ మహిళ ఠాణాకు వచ్చింది. తన భర్తతో వేరే మహిళ సన్నిహితంగా ఉంటున్నారని ఫిర్యాదు చేసింది. దీంతో నెల్లూరు జిల్లా దిశ మహిళ ఠాణా పోలీసులు 498ఏ, మరో సెక్షన్​ కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు చేసిన మహిళ భర్తను మొదటి నిందితునిగా... సాన్నిహిత్యంగా ఉంటున్న మహిళను రెండో నిందితురాలిగా పేర్కొన్నారు.

దిశ పోలీసులు 498ఏ కింద కేసు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్​ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్... ఫిర్యాదు దారి భర్తకు బంధువు కాదన్నారు.అందువల్ల ఆమెపై 498ఏ కేసు చెల్లదన్నారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా పరిగణలోకి తీసుకుని... పిటిషనర్​పై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను నిలిపివేశారు. మరో నిందితుడిపై దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:MURDER: దారుణం: నవవధువు గొంతు కోసి హతమార్చారు!

ABOUT THE AUTHOR

...view details