తెలంగాణ

telangana

ETV Bharat / state

'అమర్‌రాజా భూముల వ్యవహారంలో ప్రభుత్వ జీవో రద్దు' - అమర్​రాజా భూముల వ్యవహారం తాజా వార్త

అమర్​ రాజా ఇన్​ఫ్రా ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థకు ఇచ్చిన భూములు వెనక్కు తీసుకోవాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. గతంలో ఆంధ్రప్రదేశ్​ చిత్తూరులో ఆ సంస్థకు 483 ఎకరాలను ప్రభుత్వం కేటాయించగా.. వినియోగించడం లేదని.. 253 ఎకరాలు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీనిపై అమర్​ రాజా సంస్థ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది.

ap-high-court-orders-on-amarraja-lands-issue
'అమర్‌రాజా భూముల వ్యవహారంలో ప్రభుత్వ జీవో రద్దు'

By

Published : Jul 27, 2020, 5:13 PM IST

అమర్‌రాజా ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలంటూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో అమర్​రాజా ఇన్​ఫ్రా ప్రైవేట్​ లిమిటెడ్​కు 483 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే భూమిని వినియోగించుకోవడం లేదంటూ.. 253 ఎకరాల్ని వెనక్కి తీసుకునేందుకు ఏపీఐఐసీకి అనుమతిస్తూ.. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్​ వలెవన్​ జూన్​ 30 జీవో నెంబర్​ 33 జారీ చేశారు.

ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని అమర్​ రాజా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. భూముల్ని వెనక్కు తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని పేర్కొంది. ఆ భూముల్లో రూ.2,700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని.. భూములు వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం పేర్కొన్న కారణాల్లో వాస్తవం లేదన్నారు. అయితే ప్రభుత్వ చొరవతోనే ఏపీఐఐసీ ఆ సంస్థకు భూములు కేటాయించిందని.. వెనక్కి తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని ప్రభుత్వ తరఫు ఏజీ వాదించారు. జీవోనూ సస్పెండ్​ చేయొద్దని కోరారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ జీవోను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.

ఇదీ చూడండి :రాజ్​ భవన్​ వద్ద ఆందోళనకు కాంగ్రెస్ యత్నం.. నేతల అరెస్టు

ABOUT THE AUTHOR

...view details