తెలంగాణ

telangana

ETV Bharat / state

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టులో విచారణ - ap news

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా వ్యాధి తీవ్రత దృష్ట్యా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేమని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిపై మీ వివరణ ఏంటో చెప్పాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్​కు నోటీసులు జారీ చేసింది.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టులో విచారణ
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టులో విచారణ

By

Published : Oct 9, 2020, 4:53 PM IST

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్​ హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించటం కష్టసాధ్యమని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు.

కొన్ని రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు సైతం జరుగుతున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం తన అభిప్రాయం తెలపాలని కోరింది. ఈ మేరకురాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ రెండో తేదీకి వాయిదా వేసింది.

ఏపీలో స్థానిక ఎన్నికలు జరపాలని కోరుతూ 2019 సెప్టెంబర్​లో తాండవ యోగేష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ మరోసారి ఇవాళ హైకోర్టులో విచారణకు వచ్చింది.

ఇదీ చదవండి:నామినేషన్​కు భారీ భద్రతా చర్యలు: సీపీ జోయల్​

ABOUT THE AUTHOR

...view details