న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని వేసిన పిటిషన్‌పై హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ ఇచ్చిన లిఖిత పూర్వక ఉత్తర్వులు విడుదల అయ్యాయి. ఈ నెల 18వ తేదీన జరిగిన విచారణ తర్వాత కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్‌లపై వెలువడ్డ ఉత్తర్వులు!
న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ పిటిషన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఇచ్చిన నోటీసులకు సంబంధించిన లిఖిత పూర్వక ఉత్తర్వులు వెలువెడ్డాయి. విశాఖకు చెందిన న్యాయవాది నిమ్మి గ్రేస్ వేసిన పిటిషన్‌పై కోర్టు ఈ నెల 18న విచారణ జరిపింది. కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా పలు సంస్థలను ఆదేశించింది.
న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్‌లపై వెలువడ్డ ఉత్తర్వులు!
సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్, ట్రాయ్‌తో పాటు పలువురు సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసింది. వీరిని కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ పై విశాఖ న్యాయవాది నిమ్మి గ్రేస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఇదీ చదవండి :పోలవరం ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదు: పవన్ కల్యాణ్