తెలంగాణ

telangana

ETV Bharat / state

HC Notice: ఏఎన్‌యూ ఎఫ్ఏసీ వీసీకి ఏపీ హైకోర్టు నోటీసులు - ఏఎన్‌యూ ఎఫ్ఏసీ వీసీకి హైకోర్టు నోటీసులు తాజా వార్తలు

ఏపీలోని గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సటీ ఎఫ్ఏసీ వీసీకి (ANU VC) ఆ రాష్ట్ర హైకోర్టు (High Court) నోటీసులు జారీ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని వీసీగా నియమించడంపై ఏఎన్‌యూ ప్రొఫెసర్ రత్న షీలామణి దాఖలు చేసిన పిటిషన్​ను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం, ఉన్నత విద్యామండలికి నోటీసులిచ్చింది. అనంతరం జులై 14కు విచారణ వాయిదా వేసింది.

anu vc
anu vc

By

Published : Jun 24, 2021, 7:34 PM IST

గుంటూరు ఏఎన్‌యూ ఎఫ్ఏసీ వీసీకి (ANU VC) ఏపీ హైకోర్టు (High Court) నోటీసులు జారీ చేసింది. ఆచార్య రాజశేఖర్‌పై ప్రభుత్వ కమిటీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని వీసీగా నియమించడంపై ఏఎన్‌యూ అధ్యాపకురాలు.. ప్రొఫెసర్ రత్న షీలామణి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించారు.

రెగ్యులర్ వీసీకి వర్తించే నిబంధనలు ఎఫ్ఏసీ వీసీకి వర్తించవని పిటిషన్​లో పేర్కొన్నారు. చక్రపాణి కమిటీ ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. రత్నషీలామణి పిటిషన్‌పై ప్రభుత్వం, ఉన్నత విద్యామండలికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం.. జులై 14కు విచారణ వాయిదా వేసింది.

ఇదీ చూడండి:Maoist Hari Bhushan: ఆగిన ఉద్యమ ఊపిరి.. ముగిసిన హరిభూషణ్​ అధ్యాయం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details