తెలంగాణ

telangana

ETV Bharat / state

HIGH COURT NOTICES: డీజీపీ, సీఎస్‌కు హైకోర్టు నోటీసులు... ఏమైందంటే? - ఏపీ వార్తలు

ఆంధ్రప్రదేశ్​లో డీజీపీ, సీఎస్‌కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఆర్‌పీసీ సెక్షన్‌ - 57 కింద అదుపులోకి తీసుకుని పోలీసులు చిత్రహింసలు పెట్టారంటూ లలిత్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ జరిగింది.

HIGH COURT NOTICES
HIGH COURT NOTICES

By

Published : Nov 10, 2021, 2:06 PM IST

ఆంధ్రప్రదేశ్​లో పోలీసులు సీఆర్​పీసీలోని 54, 57 సెక్షన్లు పాటించట్లేదంటూ దాఖలైన పిటిషన్​కు సంబంధించి.. డీజీపీ, సీఎస్​లకు ఆ రాష్ట్ర హైకోర్టు నోటీసులిచ్చింది. రెండు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. పోలీసులు సీఆర్​పీసీలోని 54, 57 సెక్షన్ల కింద అదుపులోకి తీసుకుని.. చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది ఉమేష్ చంద్ర వాదించారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తికి వైద్యపరీక్షలు నిర్వహించాకే విచారించాలని నిబంధనలు చెబుతున్నాయని ధర్మాసనానికి నివేదించారు. 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలని చట్టంలో ఉందన్నారు.

ఈ ఏడాది ఎంపీ రఘురామకృష్ణరాజు, తెలుగుదేశం నేత బ్రహ్మం చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేశారని వివరించారు. పోలీసులు నిబంధనల ప్రకారం వ్యవహరించేలా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం..డీజీపీ, సీఎస్​లకు నోటీసులు జారీ చేసి.. రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

ఇదీ చదవండి:గొంతులో ఇరుక్కుపోయిన మాంసం ముక్క.. తరువాత ఏమైందంటే..

ABOUT THE AUTHOR

...view details