తెలంగాణ

telangana

ETV Bharat / state

కమిటీని సరిచేసి మళ్లీ అఫిడవిట్ దాఖలు చేయండి: హైకోర్టు

తితిదే ఆస్తులపై వేసిన కమిటీని సరిచేసి మళ్లీ అఫిడవిట్ దాఖలు చేయాలని తితిదేను ఏపీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 12కి వాయిదా వేసింది.

కమిటీని సరిచేసి మళ్లీ అఫిడవిట్ దాఖలు చేయండి: హైకోర్టు
కమిటీని సరిచేసి మళ్లీ అఫిడవిట్ దాఖలు చేయండి: హైకోర్టు

By

Published : Mar 8, 2021, 10:45 PM IST

తితిదే ఆస్తుల విక్రయాలపై దాఖలైన పిటిషన్​పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆస్తుల పరిరక్షణ కోసం కమిటీని వేస్తామని తితిదే తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. తితిదేకి సంబంధించిన 1128 ఆస్తులను నివేదికలో పొందుపరిచామని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కమిటీ నియామకాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది తప్పుబట్టారు.

కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారో తెలపలేదని వాదించారు. పిటిషనర్ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం... కమిటీని సరిచేసి మళ్లీ అఫిడవిట్ దాఖలు చేయాలని తితిదేను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 12కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: దిశ ఘటన తర్వాత స్పందన ఎలా ఉందో చూశారు :కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details