CINEMA TICKETS CASE: సినిమా టికెట్ల ధరలపై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణను ఆ రాష్ట్ర హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. సినిమా టికెట్ల ధరలపై సింగిల్ జడ్జి తీర్పు కాపీ అందకపోవడంతో విచారణ వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఈ క్రమంలో ఏజీ వాదనలు వినిపిస్తూ.. వెంటనే విచారించకపోతే ధరలు పెంచి అమ్ముకునే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. గురువారం ఉదయం మొదటి కేసుగా తీసుకుందామని చెప్పింది.
CINEMA TICKETS CASE: సినిమా టికెట్ల ధరలపై హైకోర్టులో రేపు విచారణ
CINEMA TICKETS CASE: సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తూ జారీ అయిన జీవోను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును.... ప్రభుత్వం డివిజన్ బెంచ్ ఎదుట సవాల్ చేయగా.... విచారణ గురువారానికి వాయిదా పడింది. సింగిల్ జడ్జి తీర్పు కాపీ అందకపోవటంతో విచారణను వాయిదా వేశారు.
AP High Court
సినిమా టికెట్ల ధరలపై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌పై వాదనలు విన్న ధర్మాసనం.. విచారణ రేపటికి వాయిదా వేసింది.
ఇదీ చూడండి:MOVIE TICKETS: సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవో రద్దు చేసిన హైకోర్టు