తెలంగాణ

telangana

'న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్​పై పిల్​ను కొట్టేయండి'

By

Published : Oct 9, 2020, 7:16 AM IST

హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్​కు గురయ్యాయని.. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిల్​పై విచారణ రెండు వారాలకు వాయిదా పడింది. కాగా ఈ పిటిషన్​లో వాస్తవం లేదని... ఓ పతిక్ర కథనం ఆధారంగా పిటిషనర్​ నిమ్మిగ్రేస్​ పిటిషన్ దాఖలు చేశారని న్యాయస్థానంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కౌంటర్ దాఖలు చేశారు.

ap High Court hearing on  judges phone tapping pills
ap High Court hearing on judges phone tapping pills

న్యాయమూర్తుల ఫోన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్యాప్‌ చేస్తోందంటూ దాఖలైన పిల్‌ను కొట్టేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్‌ గురువారం ఏపీ హైకోర్టులో కౌంటర్‌ వేశారు. ఆ పిల్‌ను కొట్టేయాలని కోరారు. ‘ఫోన్‌ ట్యాపింగ్‌ను పర్యవేక్షించేందుకు ఇద్దరు పోలీసు అధికారుల్ని ప్రభుత్వం నియమించిందన్న పిటిషనర్‌ వాదనలో వాస్తవం లేదు. ఓ పత్రిక ప్రచురించిన నిరాధార కథనం ఆధారంగా పిటిషనర్‌ నిమ్మిగ్రేస్‌ పిల్‌ దాఖలు చేశారు. ఆ కథనం ప్రచురించినందుకు లీగల్‌ నోటీసు ఇచ్చాం. ఆ కథనాన్ని ఏపీ ప్రభుత్వం ఖండిస్తున్న విషయాన్ని ఏజీ.. హైకోర్టు సీజేకు ఫోన్‌ చేసి చెప్పారు’ అని కౌంటర్‌లో పేర్కొన్నారు.

హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిల్‌పై విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.

ABOUT THE AUTHOR

...view details