Anticipatory Bail To Security Guards : ఏపీ అమరావతి పాదయాత్రలో సెక్యూరీటి గార్డ్స్పై రామచంద్రపురం పోలీసులు నమోదు చేసిన కేసులో.. ఆ రాష్ట్ర హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేసు నమోదు చేసిన భద్రతా సిబ్బందికి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అమరావతి పరిరక్షణ సమితి పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
అమరావతి పాదయాత్ర రథం సెక్యూరిటీ గార్డులకు ముందస్తు బెయిల్ - security guards in Amravati padayatra
Anticipatory Bail To Security Guards: అమరావతి పాదయాత్ర రథం ముగ్గురు సెక్యూరిటీ గార్డులకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు బెయిల్ కోసం అమరావతి పరిరక్షణ సమితి వేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం.. ఈ మేరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
పాదయాత్రలో భాగంగా రామచంద్రపురం గ్రామం వద్ద రైతులు రథాన్ని నిలిపి ఉండగా.. భద్రతా సిబ్బందిపై పోలీసులు దాడి చేసి సీసీ కెమెరా హర్డ్ డిస్క్లను తీసుకువెళ్లారని.. తిరిగి వారిపైనే పోలీసులు కేసు నమోదు చేశారని న్యాయవాది లక్ష్మీ నారాయణ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పోలీసుల విధినిర్వహణను అడ్డుకున్నారనే నెపంతో నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని తెలిపారు. సెక్యూరీటి గార్డ్స్పై అన్యాయంగా కేసు నమోదు చేశారని.. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయస్థానం ముగ్గురు సెక్యూరీటి గార్డ్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఇవీ చదవండి:
TAGGED:
అమరావతి పాదయాత్ర