తెలంగాణ

telangana

ETV Bharat / state

'బ్లాక్​ ఫంగస్​ కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం'

ఏపీలో 252 బ్లాక్‌ఫంగస్‌ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. దీనికి అవసరమైన మందులను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. తుపాను ప్రభావంతో ముందస్తుగా ఆక్సిజన్​ నిల్వలు సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించారు.

ap latest news
ap news

By

Published : May 25, 2021, 10:48 PM IST

ఏపీలో మెుత్తం 252 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం ఇంజక్షన్లు అందుబాటులోకి తెస్తున్నామన్న ఆయన.. ఇప్పటికే 3 వేల డోసుల ఇంజక్షన్లను జిల్లాలకు పంపినట్లు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్​ మరణాలపై ఇప్పటివరకు తమవద్ద ఎటువంటి సమాచారం లేదని వెల్లడించారు. కరోనా చికిత్సలో వినియోగిస్తున్న రెమ్​డెసివిర్​ కూడా ఎక్కడా కొరత లేదని పేర్కొన్నారు. తుపాను దృష్ట్యా ముందస్తుగా 767 టన్నుల ఆక్సిజన్‌ నిల్వలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.

ఆనందయ్య మందుపై త్వరలోనే నిర్ణయం..

ఆనందయ్య మందుపై మరో నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుందని సింఘాల్‌ అన్నారు. ఇప్పటికే మందు నమూనాలపై పలు ప్రయోగశాలల్లో పరీక్షలు జరుగుతున్నందున వాటి వివరాలు త్వరలోనే ప్రభుత్వానికి అందుతాయని తెలిపారు. నివేదిక ఆధారంగా ఆనందయ్య మందుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఇవీ చదవండి:సేంద్రియ సేద్యంతోనే కల్తీలేని ఆహారం: నిరంజన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details