తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో కొత్త ఇసుక విధానం.. ఉత్తర్వులు జారీ - sand problems in ap news

ఆంధ్రప్రదేశ్​లో నూతన ఇసుక విధానం- 2019లో మార్పు చేర్పులు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇసుక తవ్వకాలు, విక్రయాల బాధ్యతలు జోన్ల వారిగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేతృత్వంలో జరుగుతాయని పేర్కొంది. ఇక నుంచి ఆఫ్ లైన్​లోనే ఇసుక లభ్యత ఉంటుందని స్పష్టం చేసింది.

ఏపీలో కొత్త ఇసుక విధానం.. ఉత్తర్వులు జారీ
ఏపీలో కొత్త ఇసుక విధానం.. ఉత్తర్వులు జారీ

By

Published : Nov 13, 2020, 6:51 AM IST

ఆఫ్‌లైన్‌లోనే వినియోగదారులకు ఇసుకను అందజేసేందుకు ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇసుక విధానం-2019 లో మార్పు చేర్పులు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇసుక తవ్వకాలు, విక్రయాల బాధ్యతలు జోన్ల వారీగా.. కేంద్రప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకు రాకుంటే వేలం ద్వారా ప్రైవేటు సంస్థలకు ఇసుక రీచ్‌లను అప్పగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ఉత్తర్వులు ఇచ్చారు.

వాల్టా చట్టానికి లోబడి ఇసుక తవ్వకాలు జరపాలని ఉత్తర్వుల్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలపై నిషేధం విధించింది. నాణ్యమైన ఇసుక కోసం ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీల వద్ద ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. బ్యారేజీల వద్ద ఇసుక తవ్వకాల సమయంలో ఇరిగేషన్, గనుల శాఖల అనుమతులు తప్పనిసరని తెలిపింది. షెడ్యూల్ ప్రాంతాల్లోని ఇసుక రీచుల నిర్వహణ గిరిజనులకే ఇవ్వాలన్న నిబంధనను పాటించాలని ఆదేశాలు ఇచ్చింది.

ఇదీ చదవండి:డిసెంబర్​లో జీహెచ్​ఎంసీ ఎన్నికలు: సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details