తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫిబ్రవరిలో పరిమిత పోస్టులతో డీఎస్సీ! - ఏపీ డీఎస్సీ తాజా వార్తలు

డీఎస్సీ నిర్వహణకు ఏపీ విద్యాశాఖ సిద్ధమవుతోంది. పరిమిత పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని యోచిస్తోంది. ఈసారి పరీక్షలను ఆన్​లైన్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఖాళీలను పంపాలని అధికారులకు ఆదేశాలిచ్చింది.

ఫిబ్రవరిలో పరిమిత పోస్టులతో డీఎస్సీ!
ఫిబ్రవరిలో పరిమిత పోస్టులతో డీఎస్సీ!

By

Published : Dec 22, 2020, 9:38 AM IST

పరిమిత పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు ఏపీ విద్యాశాఖ సిద్ధమవుతోంది. జనవరిలో ఇతర పోటీ పరీక్షలు ఉన్నందున... ఆన్‌లైన్‌ ద్వారా ఫిబ్రవరిలో నిర్వహించనుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనుమతించిన ఈ డీఎస్సీలో... కొన్నేళ్లుగా మిగిలిన బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు డీఎస్సీ-2018లో మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల ఖాళీల వివరాలు సేకరిస్తోంది.

టెట్‌ వల్ల కొంత జాప్యం జరిగే అవకాశం ఉన్నందున... దానితో సంబంధం లేకుండా డీఎస్సీ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. డీఎస్సీకి పాఠ్యప్రణాళికను మార్చే బాధ్యతను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలికి అప్పగించారు. మరో వారంలో పాఠ్యప్రణాళిక ఖరారయ్యే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్​ కథేంటి?

ABOUT THE AUTHOR

...view details