ఈ నెల 8న ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, ఎన్నికల కోడ్ విధింపుపై... హైకోర్టును ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది.... శనివారం వ్యాజ్యం దాఖలు చేశారు. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు నవంబర్ 17న ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని.... దానిపై తాము హైకోర్టును ఆశ్రయించామని గుర్తుచేశారు. కోర్టు ఉత్తర్వులు అందిన మూడు రోజుల్లోగా... రాతపూర్వకంగా ఎస్ఈసీకి వివరాలు సమర్పించి సంప్రదింపులు జరపాలని ప్రభుత్వాన్ని..... డిసెంబర్ 29న ధర్మాసనం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు. ధర్మాసనం ఉత్తర్వులు జనవరి 5న తమకు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎందుకు సిద్ధంగా లేదో జనవరి 7న రాతపూర్వకంగా ఎస్ఈసీకి తెలియచేశామన్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రతి అందుకోకముందే.... సంప్రదింపుల కోసం...సీఎస్, పీఆర్‌శాఖ ముఖ్యకార్యదర్శికి ఎస్ఈసీ లేఖలు పంపారని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఆ లేఖలు, సంప్రదింపులు లాంఛనప్రాయంగా ఉన్నాయని.... ప్రజారోగ్యం, ప్రభుత్వాభిప్రాయాలతో సంబంధం లేకుండా.... ఎన్నికల నిర్వహణకు కమిషనర్ ఆలోచన చేశారని వ్యాజ్యంలో ప్రస్తావించారు.
కంటి తుడుపులా సంప్రదింపులు..!
ఈ నెల 8న సాయంత్రం నాలుగున్నర గంటలకు.... ప్రభుత్వాధికారులతో ఎస్ఈసీ సంప్రదింపుల ప్రక్రియ నిర్వహించి.... తర్వాత కొద్ది గంటల్లోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారని.... ప్రభుత్వం తన వ్యాజ్యంలో పేర్కొంది. దీన్ని గమనిస్తే సంప్రదింపుల చర్య కంటితుడుపులా ఉందని ప్రస్తావించింది. కోర్టు ఉత్తర్వులను, సంప్రదింపుల ప్రక్రియను కమిషనర్ అవహేళన చేశారని.. తాము రాతపూర్వకంగా సమర్పించిన వివరాల్ని ఎస్ఈసీ పరిగణనలోకి తీసుకోలేదని తెలిపింది. కరోనా టీకా విషయమై కేంద్రం... అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్, అలాగే డ్రై రన్ నిర్వహించిందని వ్యాజ్యంలో ప్రస్తుతించింది. టీకా పంపిణీ ప్రక్రియ.... సాధారణ ఎన్నికల విధానంలా ఉండాలని.... కేంద్రం పలుమార్లు ఉద్ఘాటించిందని.... అంటే రాష్ట్ర యంత్రాంగమంతా అందులో పాల్గొనాల్సిన అవసరముందని పేర్కొంది. సోమవారం... ముఖ్యమంత్రులతో ప్రధాని ఆన్‌లైన్ భేటీ ఉందని..... ఈ విషయాన్ని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లి సీఎం ప్రకటన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు ప్రభుత్వం తన వ్యాజ్యంలో వివరించింది.
కేసులు పెరుగుతుంటే.. ఎన్నికలు ఎలా?