ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ(Governor Biswabhusan Harichandan tested covid positive) అయింది. ఈ నెల 15న జరిపిన పరీక్షల్లో గవర్నర్‌కు కొవిడ్ సోకినట్లు తెలిందని హైదరాబాద్‌లోని ఏఐజీ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి(Ap Governor Biswabhusan Admitted AIG Hospital at hyderabad) నిలకడగా ఉందని.. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (AP governor) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ఆయన రెండు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో గవర్నర్‌ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స(Governor Biswabhusan Harichandan Admitted AIG Hospital at hyderabad) అందిస్తున్నారు. నిన్న ఆర్‌టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా.. ఇవాళ కొవిడ్ పాజిటివ్‌గా తెలింది.