తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ అసెంబ్లీ ప్రొరోగ్.. ఆ రెండు బిల్లుల పరిస్థితేంటి.! - వికేంద్రీకరణ బిల్లు ఆర్టినెన్స్ యోచన

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలిని ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ విశ్వభూషన్ హరిచంద్రన్ నోటిఫికేషన్ విడుదలచేశారు. వికేంద్రీకరణ, సీఆర్టీఏ రద్దు బిల్లుల సెలెక్ట్ కమిటీపై వివాదం జరుగుతోన్న తరుణంలో ప్రొరోగ్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రెండు కీలక బిల్లులపై ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ap-governor-prorogued-assembly
ఏపీ అసెంబ్లీ ప్రొరోగ్.. ఆ రెండు బిల్లుల పరిస్థితేంటీ.!

By

Published : Feb 13, 2020, 6:40 PM IST

ఆంధ్రప్రదేశ్​ శాసనసభ, శాసన మండలిని ప్రొరోగ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ఉభయ సభలను ప్రొరోగ్ చేస్తున్నట్లు గవర్నర్‌ విశ్వభూషన్ హరిచంద్రన్ ఆదేశాలు జారీ చేశారు.

అసెంబ్లీని ప్రొరోగ్‌ చేసి వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల స్థానంలో ఆర్డినెన్స్‌ తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. వీటిపై సెలెక్ట్​ కమిటీ వివాదం జరుగుతోన్న నేపథ్యంలో ప్రోరోగ్​ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి:'చాలా వచ్చాయి.. అన్నింటినీ అడ్డుకున్నామా..?'

ABOUT THE AUTHOR

...view details