AP Governor Biswabhusan Fell Sick: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో తరలించారు. స్వల్ప అస్వస్థతకు గురికావడంతో స్థానికంగా ఉన్న ఓ డయాగ్నిస్టిక్ సెంటర్‌లో పరీక్షలు నిర్వహించిన అనంతరం.. ఆయణ్ని హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల గవర్నర్ కరోనా బారినపడి కోలుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని విశాఖకు వెళ్లారు.
AP Governor Health News :ఏపీ గవర్నర్ విశ్వభూషణ్‌కు అస్వస్థత.. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలింపు - ap governor discharged from AIG
AP Governor News : కొవిడ్ నుంచి కోలుకుని ఈనెల 23వ తేదీన డిశ్చార్జ్ అయిన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (AP Governor Biswabhusan Health updates) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో హరిచందన్‌ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

AP Governor Hospitalised : ఈ నెల 17న దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (AP governor) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. గవర్నర్ స్వల్ప దగ్గు, జలుబుతో బాధపడుతున్నందున ముందు జాగ్రత్త చర్యగా ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయించారు. ఇందులో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న కొద్దిరోజుల తరువాత కోలుకున్నారు. ఈనెల 23వ తేదీనే ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. ఇంతలోనే మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా.. గవర్నర్‌కు కరోనా సోకింది. కొవిడ్ తగ్గుముఖం పడుతున్నప్పటికీ అశ్రద్ధగా ఉండవద్దని ప్రజలకు వైద్యులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: