టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్‌లో రజతం సాధించిన మీరాభాయి ఛానును ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. తొలి పతకం గెలవటంపై దేశమొత్తం గర్విస్తోందని ట్వీట్ చేశారు.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో ఓ పతకం చేరటం పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. రజత పతకం సాధించిన మీరాబాయి చానును జగన్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగతా క్రీడాకారులు కూడా పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఒలింపిక్ క్రీడల్లో ప్రారంభమైన భారత ప్రదర్శనను చూడటం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. మీరా భాయి ఛాను 49 కేజీల విభాగంలో రజత పతకం గెలిచారు.