తెలంగాణ

telangana

ETV Bharat / state

మాధ్యమం ఎంపిక అవకాశం తల్లిదండ్రులకే.. - ఆంగ్ల మాధ్యమం అమలుపై సర్కారు సరికొత్త ఆలోచన

ఆంధ్రప్రదేశ్​లో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుపై ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. పిల్లలు ఏ మాధ్యమంలో చదవాలో ఎంపిక చేసుకునే అవకాశం తల్లిదండ్రులకే కల్పించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ap-governments-new-idea-on-the-implementation-of-the-english-medium
మాధ్యమం ఎంపిక అవకాశం తల్లిదండ్రులకే..

By

Published : Apr 22, 2020, 8:05 AM IST

ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులు ఏ మాధ్యమంలో చదవాలో ఎంపిక చేసుకునే బాధ్యతను ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రులకే కల్పించింది. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ఉత్తర్వులిచ్చింది. ఆంగ్ల మాధ్యమంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో... తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అభిప్రాయాలు సేకరించనున్నారు. దీని ఆధారంగా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. మే మొదటి వారంలోనే సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పేరెంట్స్ కమిటీలు ఇంగ్లీషు మీడియంపై ఇచ్చిన అభిప్రాయాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల... ప్రభుత్వం ఈ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎక్కువ మంది తల్లిదండ్రులు కోరుకున్న చోట తెలుగు మీడియం తరగతులు కూడా నడపాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details