పంచాయతీ ఎన్నికల అంశంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికల నిర్వహణ అసాధ్యమని వైసీపీప్రభుత్వం పేర్కొంది. హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరింది.
పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ - sec on panchayath elections in ap
పంచాయతీ ఎన్నికల అంశంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.
ఎన్నికలకు సంబంధించి హైకోర్టు గురువారం ఉదయం కీలక తీర్పు వెలువరించింది. ఎస్‌ఈసీ అప్పీల్‌పై ధర్మాసనం ఎదుట రెండ్రోజుల క్రితం వాదనలు ముగియగా.. జడ్జిమెంట్ రిజర్వ్ చేసిన హైకోర్టు ఇవాళ తీర్పు చెప్పింది. ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. పంచాయతీ ఎన్నికలు, ప్రజారోగ్యం రెండూ ముఖ్యమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికలు ఆపడానికి సహేతుక కారణాలు లేవని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.