కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన శ్రీశైలం నీటి తరలింపు జీవోను తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తోందని విశ్రాంత ఇంజినీర్ల సంఘం వెల్లడించింది. రాష్ట్ర నీటివాటాను దొడ్డిదారిన వాడుకునేందుకే ఈ జీఓను తెచ్చారని సంఘం తీవ్రంగా ఖండించింది.
శ్రీశైలం నీటి తరలింపు జీవోను తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తోంది' - illicit Go by ap govt
![శ్రీశైలం నీటి తరలింపు జీవోను తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తోంది' 'శ్రీశైలం నీటి తరలింపు జీవో కుట్రపూరితం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7090850-thumbnail-3x2-go.jpg)
21:34 May 06
శ్రీశైలం నీటి తరలింపు జీవోను తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తోంది'
కృష్ణా జలాలను మళ్లించే కుట్రపూరిత జీఓ...
శ్రీశైలం నీటి తరలింపు జీవోపై తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా తెలంగాణ ప్రయోజనాలను కాలరాసే జీవో అని పేర్కొంది. మొత్తం కృష్ణా జలాలను మళ్లించే కుట్రపూరిత పథకమని ఏపీ ప్రభుత్వంపై మండిపడింది. శ్రీశైలం నుంచి రోజుకు 10 టీఎంసీలు తరలించేందుకు ఏపీ జీవో జారీ చేసింది. పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు 7 టీఎంసీలు తలించేందుకే ఈ అక్రమ జీవో అని వివరించింది. రాయలసీమ ఎత్తిపోతల నుంచి 3 టీఎంసీలు తీసుకునే ఎత్తుగడలో ఈ జీఓ జారీ చేసింది. ఈ కుట్రపూరిత జీఓను తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తోందని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం స్పష్టం చేసింది.